Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో మరోక వ్యక్తి అరెస్ట్

దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ఈరోజు మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్ కు చెందిన ఇమాజ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో మరోక వ్యక్తి అరెస్ట్

Darbhanga Blast Case

Updated On : July 26, 2021 / 3:01 PM IST

Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ఈరోజు మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్ కు చెందిన ఇమాజ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈకేసులో నిందితులైన మాలిక్ సోదరులతోపాటు ఇమాజ్ కూడా దర్భంగా పేలుడుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ఇటీవల దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించింది. విచారణలో ఎన్ఐఏ అధికారులు వారివద్ద నుంచి కీలక సమాచారం రాబట్టారు. పేలుడు వెనుక లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించారు.

ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు తెలుసుకున్నారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడినట్లు అధికారులు పేర్కోన్నారు.