కేరళలో NIA సోదాలు

కేరళ: జాతీయ దర్యాప్తు సంస్ధ NIA కి చెందిన అధికారులు ఆదివారం కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ లలో సోదాలు నిర్వహిస్తునారు. 2016 లో కాసర్ గోడ్ లో మిస్సైన 21 మంది యువకులు ఉగ్రవాద సంస్ధల్లో చేరిన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి . కాసర్ గోడ్ లోని ఇద్దరు అనుమానితులు ఇళ్లల్లోనూ, పాలక్కాడ్ లో ఒకరి ఇంటిలోనూ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. 2016లో వీరి ఇంటిలోని వ్యక్తులు ఉగ్రవాద భావజాలంతో దేశం విడిచి పెట్టి వెళ్లి ISIS ఉగ్రవాద సంస్ధలో చేరినట్లు అధికారులు గుర్తించారు. NIA అధికారులు ముగ్గురు ఇళ్లలోని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.