Nine Died In Road Accident : విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, టీచర్ సహా 9 మంది మృతి

విహారయాత్రలో విషాదం నెలకొంది. కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన పాలపక్కడ్‌లో చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది మృతి చెందగా, మరో 38 మంది గాయపడ్డారు. మృతుల్లో  ఐదుగురు విద్యార్థులు, టీచర్ ఉన్నారు.  

Nine Died In Road Accident : విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, టీచర్ సహా 9 మంది మృతి

road accident

Updated On : October 6, 2022 / 11:43 AM IST

Nine Died In Road Accident : విహారయాత్రలో విషాదం నెలకొంది. కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన పాలపక్కడ్‌లో చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది మృతి చెందగా, మరో 38 మంది గాయపడ్డారు. మృతుల్లో  ఐదుగురు విద్యార్థులు, టీచర్ ఉన్నారు.

ఎర్నాకుళం జిల్లా మూలంతురుతిలోని ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు.. టూరిస్ట్ బస్సులో ఊటీకి విహారయాత్రకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన టూరిస్టు బస్సు రోడ్డుపక్కన ఉన్న కాల్వలోకి పడిపోయింది.

Road Accident Four killed : పూజ కోసం వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, టీచర్‌, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 49 మంది ఉన్నారని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సహాయంతో టూరిస్టు బస్సును పైకిలేపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.