North zone DCP: మహిళలను బెదిరించి బంగారం అపహరించిన నిందితులను పట్టుకున్న నార్త్ జోన్ పోలీసులు

సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో మహిళలను బెదిరించి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

North zone DCP: మహిళలను బెదిరించి బంగారం అపహరించిన నిందితులను పట్టుకున్న నార్త్ జోన్ పోలీసులు

Chandana Ips

Updated On : March 15, 2022 / 6:45 PM IST

North zone DCP: సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో మహిళలను బెదిరించి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి కేసుల వివరాలు వెల్లడించారు. నార్త్ జోన్ పరిధిలోని బేగంపేట ఏరియాలో ఓ మహిళ ఇంట్లో చోరీ జరిగిందనీ తమకు డయల్ 100 ద్వార సమాచారం అందిందని డీసీపీ తెలిపారు. మహిళ మెడకు వైర్ బిగించిన నిందితుడు ఆమె వద్దనున్న 5 తులాల బంగారాన్ని అపహరించాడు. దీనిపై మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈకేసులో గణేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడని డీసీపీ చందన దీప్తి తెలిపారు.

Also read: AP Corona Cases : ఏపీలో కొత్తగా 59 కరోనా కేసులు

కంటోన్మెట్ బోర్డులో స్వీపర్ గా పని చేస్తున్న గణేష్.. వ్యసనాలకు అలవాటు పడి..అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఇలా చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. వారం క్రితం మహిళ ఇంటికి శానిటేషన్ సర్వేకి వెళ్లిన గణేష్.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుపై కన్నేశాడు. అనంతరం మహిళ ఇంటివద్ద రెక్కీ చేసి మహిళ ఇంట్లో దొంగతనం చేశాడని డీసీపీ చందన దీప్తి తెలిపారు. దొంగికించిన 5 తులాల బంగారాన్ని నిందితుడు గణేష్ ఓ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టాడని.. ఈ ఘటనలో పాన్ బ్రోకర్ ను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. నిందితుల నుంచి ఐదు తులాల బంగారంతో పాటు రూ.49 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వివరించారు.

Also read: Komatireddy RajGopal Reddy: కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతు ఇవ్వలేదు: రాజగోపాల్ రెడ్డి

ఇక నార్త్ జోన్ పరిధిలోని మార్కెట్ పిఎస్ లిమిట్స్ లో చోటుచేసుకున్న మరో చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ మార్కెట్ కి వెళ్లి వస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు మహిళను మోసపూరిత మాటలతో మభ్యపెట్టారు. సంతానం కోసం చేసిన పూజ ప్రసాదం అంటూ మహిళకు మత్తు మందు ఇచ్చిన నిందితులు ఆమె వద్దనున్న 7 తులాల బంగారాన్ని దోపిడీ చేశారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..ముగ్గురు నిందితుల కోసం గాలించారు. నిందితులు మహారాష్ట్రకి చెందిన కంజర్ మోహల్ల గ్యాంగ్ కి చెందిన మనోజ్, కిషన్, సురేష్ గా గుర్తించినట్లు డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేశామని..ఈ ముగ్గురు నిందితులు ముంబైలో నటోరియస్ మోస్ట్ వాంటెడ్ గా తేలిందని డీసీపీ తెలిపారు. నిందితులను కస్టడీకి తీసుకొని పూర్తి విచారణ చేస్తే ప్రసాదంలో కలిపిన మత్తుమందు గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

Also read: CM KCR: నిపుణుల రిపోర్ట్ రాగానే.. 111 జీవోను ఎత్తేస్తాం: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన