క్వారంటైన్ కేంద్రంలో దారుణం, స్నానం చేస్తుండగా వీడియో తీసి యువతికి వేధింపులు

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 10:52 AM IST
క్వారంటైన్ కేంద్రంలో దారుణం, స్నానం చేస్తుండగా వీడియో తీసి యువతికి వేధింపులు

Updated On : May 22, 2020 / 10:52 AM IST

క్వారంటైన్ కేంద్రంలోనూ మహిళలకు రక్షణ కరువైంది. అక్కడ కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. కొందరు నీచులు కామంతో కళ్లు మూసుకుపోయి దురాఘతాలకు ఒడిగడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. 

చెప్పిన చోటుకి రావాలని వేధింపులు:
ఓ యువతి ఇండోర్ నుంచి తన సొంతూరు సాగర్ కు వచ్చింది. ఈ క్రమంలో అధికారులు ఆమెను కుమేరియా భటోలి గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. అదే గ్రామంలో నివాసం ఉండే సునీల్ లడియా, లక్ష్మణ్ లడియా అనే ఇద్దరు వ్యక్తులు ఆమెపై కన్నేశారు. ఓ రోజు ఆమె క్వారంటైన్ కేంద్రం పరిసరాల్లో ఉండే బాత్‌ రూమ్‌లో స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశారు. ఆ వీడియోను సదరు యువతికి పంపి లైంగికంగా వేధింపులకు గురిచేశారు. తాము చెప్పిన చోటుకి రావాలని, తమను కలవాలని వేధించారు.

వీడియో చూపి బ్లాక్ మెయిల్:
అంతటితో ఆగకుండా.. ఎవరికైనా చెబితే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. వారి ఆగడాలతో విసిగిపోయిన యువతి.. పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు నిందితులను గుర్తించారు. అప్పటికే ఆ కామాంధులు వీడియో డిలీట్ చేయడంతో.. బాధితురాలి దగ్గర ఉన్న వీడియో, వారు బాధితురాలికి పంపిన మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని గర్హకోట పోలీసులు తెలిపారు.