హైటెన్షన్‌ విద్యుత్ వైర్లు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 04:27 PM IST
హైటెన్షన్‌ విద్యుత్ వైర్లు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

Updated On : April 25, 2019 / 4:27 PM IST

బెంగళూరు నగరంలోని మెజిస్టిక్ రైల్వేస్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కిన ఓ వ్యక్తి… విద్యుత్‌ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు ఎక్కిన అనంతరం తాను కరెంట్‌ తీగలను పట్టుకుంటున్నానని గట్టిగా అరిచాడు. స్థానికులు, రైల్వే సిబ్బంది అప్రమత్తమై అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అతడు విద్యుత్‌ తీగలను పట్టుకున్నాడు. క్షణాల్లోనే కిందపడిపోయాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడు రైలు పైకి ఎక్కుతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదని కొందరు చెబుతున్నారు.