108 Ambulance: 108 వాహనంలో సరిపడా డీజిల్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన పేషెంట్

ఈ ఘటనపై బన్స్వారా సీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఘటన సమాచారం తెలియగానే వెంటనే విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. బాధితుడి కుటుంబీకులను కలిసి, నిర్వాహకుల నిర్లక్ష్యం గురించి వాకబు చేస్తున్నట్టు తెలిపారు. 108 వాహనాన్ని ప్రైవేటు ఏజెన్సీ నడుపుతోందని, అంబులెన్స్ మెయింటెనెన్స్ బాధ్యత వారిదేనని అన్నారు.

108 Ambulance: 108 వాహనంలో సరిపడా డీజిల్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన పేషెంట్

Patient Dies As 108 Ambulance Runs Out Of Fuel At Rajasthan

Updated On : November 26, 2022 / 8:56 PM IST

108 Ambulance: 108 వాహనం అంటే.. ప్రాణాలు కాపాడే సంజీవనిలా గుర్తొస్తుంది ఎవరికైనా. ఆపదలో ఉన్నవారు వెంటనే కాల్ చేసేది ఆ నంబరుకే. అయితే ఇదే వాహనం ఒక వ్యక్తి ప్రాణం తీసింది అంటే నమ్మగలరా? ప్రాణం తీయడం అంటే అదేదో రోడ్డు ప్రమాదం కాదు. 108 వాహనంలో డీజిల్ లేకపోవడంతో ఒక పేషెంటుని సకాలంలో ఆసుపత్రికి తరలించేకపోయారు. దీంతో ఆ పేషెంటు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రాజస్తాన్ రాష్ట్రంలోని బంస్వారా జిల్లాలో జరిగిన దారుణమిది.

బంస్వారా జిల్లా దనపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల తేజియ అనే వ్యక్తి స్పృహతప్పడంతో బంధువులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగానే పేషెంట్‌ను అందులో ఎక్కించారు. ఆసుపత్రికి వెళ్తుండగా అకస్మాత్తుగా వాహనం ఆగిపోయింది. చూస్తే అందులో ఇంధనం లేదు. చేసేదేమీ లేక పేషెంటు కుటుంబ సభ్యులు వాహనాన్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బాగా ఆలస్యం కావడంతో, వైద్యం అందక తేజియ కన్నుమూశాడు.

కాగా, ఈ ఘటనపై బన్స్వారా సీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఘటన సమాచారం తెలియగానే వెంటనే విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. బాధితుడి కుటుంబీకులను కలిసి, నిర్వాహకుల నిర్లక్ష్యం గురించి వాకబు చేస్తున్నట్టు తెలిపారు. 108 వాహనాన్ని ప్రైవేటు ఏజెన్సీ నడుపుతోందని, అంబులెన్స్ మెయింటెనెన్స్ బాధ్యత వారిదేనని అన్నారు.

DCW: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. దేశానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్