Tollywood Producer Dil Raju: దిల్ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్
శ్యాం సుందర్ రెడ్డి మృతివార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు దిల్ రాజును పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Dil Raju and Pawan Kalyan
Dil Raju Father Passes away: టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరు దిల్ రాజు. మిగిలిన ఇద్దరు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి.
Dil Raju : నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..
శ్యాం సుందర్ రెడ్డి మృతివార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు దిల్ రాజును పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. శ్యాం సుందర్ రెడ్డి మృతివార్త తెలుసుకున్న టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిల్ రాజు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్యాసుందర్ రెడ్డి మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.