Harish Case : కుటుంబం పరువు తీశాడని చంపేశారు.. హరీశ్ హత్య కేసులో 11మంది అరెస్ట్

హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ లో హరీశ్ దారుణ హత్య సంచలనం రేపింది. ఈ మర్డర్ కేసులో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ రిమాండ్ కు తరలించారు. యువతిని ప్రేమించినందుకు హరీశ్ ను యువతి అన్నయ్య, అతడి ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారు.

Harish Case : కుటుంబం పరువు తీశాడని చంపేశారు.. హరీశ్ హత్య కేసులో 11మంది అరెస్ట్

Updated On : March 6, 2023 / 12:25 AM IST

Harish Case : హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ లో హరీశ్ దారుణ హత్య సంచలనం రేపింది. ఈ మర్డర్ కేసులో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ రిమాండ్ కు తరలించారు. యువతిని ప్రేమించినందుకు హరీశ్ ను యువతి అన్నయ్య, అతడి ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారు. యువతి ముందే హరీశ్ ను కిరాతకంగా చంపేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు బైక్స్, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

బుధవారం రాత్రి నడిరోడ్డుపై హరీశ్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన అలజడి రేపింది. ప్రేమించిన యువతి కళ్లెదుటే ప్రియుడిని దారుణంగా హతమార్చారు. రాత్రి 9గంటల సమయంలో దూలపల్లి రహదారిపై వస్తుండగా యువకుడిపై కొందరు దుండగులు కత్తులతో దాడి
చేసి దారుణంగా చంపేశారు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృ

6 నెలల కిందటే హరీశ్ కుటుంబం సూరారం కాలనీకి వచ్చింది. అంతకుముందు ఎల్లారెడ్డిగూడెంలో నివాసం ఉన్న సమయంలో ముస్లిం యువతిని హరీశ్ ప్రేమించాడు. యువతి బంధువులు హెచ్చరించినా హరీశ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పగతో రగిలిపోయిన యువతి బంధువులు పక్కా ప్లాన్ ప్రకారం హరీశ్ ను దారుణంగా హత్య చేసి యువతిని తీసుకెళ్లిపోయారు.

తన సోదరికి దూరంగా ఉండమని హెచ్చరించినా వినకుండా ఏకంగా సోదరిని ఎత్తుకెళ్లి తమ కుటుంబ పరువు తీశాడనే కక్షతో హరీశ్ ను యువతి సోదరుడు దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన ఓ యువతి, కుత్బుల్లాపూర్ సూరారం మైత్రినగర్ కాలనీకి చెందిన దేవరకొండ హరీష్ (28)లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

అయితే, యువతి సోదరుడు దీన్ దయాల్ కు అది నచ్చలేదు. సోదరిని, హరీష్ ను హెచ్చరించాడు. దీంతో హరీశ్.. ఇకపై యువతికి దూరంగా ఉంటానని హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ యువతితో ఫోన్ లో మాట్లాడటం, కలవడం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. యువతి సోదరుడికి తెలియకుండా ఉండేందుకు.. హరీశ్ తన మకాం మార్చేశాడు. దూలపల్లిలో ఉన్న ఓ వెంచర్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం పొందాడు. కొన్ని రోజుల తర్వాత యువతి సోదరుడు హరీశ్ ఆచూకీ తెలుసుకున్నాడు.

Also Read..Abdullapurmet Naveen Case : హరిహరకృష్ణలో కనిపించని పశ్చాత్తాపం, చట్టంలో లొసుగులే బయటకు తీసుకొస్తాయని ధీమా

తన సోదరిని ఎత్తుకెళ్లి కుటుంబం పరువు తీసిన హరీష్ కుమార్ ను ఎలాగైనా చంపాలని యువతి సోదరుడు డిసైడ్ అయ్యాడు. పథకం ప్రకారం తన మూడు కత్తులను పదును పెట్టి మరీ తన ఇంట్లో సిద్ధంగా ఉంచాడు. ఈ క్రమంలో దూలపల్లి హనుమాన్ టెంపుల్ సమీపంలోకి హరీశ్ అతడి ప్రియురాలు.. రాగానే ముందుగా కాపు కాసిన యువతి సోదరుడు, అతని స్నేహితులు వారిని చుట్టుముట్టారు. కత్తులతో హరీష్ పై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కేసును సవాల్ గా తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు వందలాది సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొన్నారు. జియాగూడలో ఓ గదిలో ఆశ్రయం పొందిన 8 మంది నిందితులతో పాటు, హరీష్ ఆచూకీ చూపించేందుకు సహకరించిన రాజేంద్ర కుమార్ నవనీతలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక హత్యలో పాల్గొన్న నిందితులు అంతా 20 నుంచి 22 వయసు కలిగిన యువకులే కావడం ఆందోళన కలిగించే అంశం.