నల్లమల అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల్లో రాజకీయ నేత అరెస్ట్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం దుమారం రేపింది. ఓ రాజకీయ నేత ఇందులో ఇన్వాల్వ్ కావడం సంచలనమైంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం దుమారం రేపింది. ఓ రాజకీయ నేత ఇందులో ఇన్వాల్వ్ కావడం సంచలనమైంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం దుమారం రేపింది. ఓ రాజకీయ నేత ఇందులో ఇన్వాల్వ్ కావడం సంచలనమైంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు.. రాజకీయ నేతను అరెస్ట్ చేశారు. అతడిని తిరుమలేష్ గా గుర్తించారు. గుప్తనిధుల తవ్వకాల్లో తిరుమలేష్ కి ఎల్లప్ప, బాలస్వామి, శ్రీను, షహనాజ్ అలీ సహకరించినట్టు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో భ్రమరాంబిక దేవి విగ్రహాన్ని పూర్తిగా పెకిలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతం నుంచి స్కార్పియో వాహనంలో తిరిగి వెళ్తున్న సమయంలో.. గిరిజనులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిని వలపట్టి పట్టుకున్నారు అధికారులు.
నల్లమల అడవుల్లో లింగాల మండలం సమీపంలో గుప్తనిధుల కోసం కొంతకాలంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కి చెందిన ఐదుగురు సభ్యుల ముఠా గుప్తనిధుల వేటలో ఉంది. దీని గురించి స్థానిక గిరిజనులు, చెంచులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ కు చెందిన టీఆర్ఎస్ నేత తిరుమలేష్.. ఈ ముఠాలో సభ్యుడు కావడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ రేంజ్ పరిధిలోని భ్రమరాంబికాదేవి ఆలయం ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన రాజకీయ నేత పి.తిరుమలేష్ నాయుడు గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. గుప్త నిధుల కోసం ఆలయంలోని విగ్రహాన్ని పెకిలించి తవ్వకాలు జరిపారు. మంగళవారం(ఫిబ్రవరి 11,2020) తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో తిరుమలేశ్ నాయుడు తన కారులో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.
తన అనుచరులు ఎల్లప్ప, బాలస్వామి, శ్రీనులతో పాటు డ్రైవర్ షహబాజ్ అలీలతో కలిసి తిరుమలేశ్ అమ్రాబాద్ అడవుల్లోకి వెళ్లారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్లాన్ తో ఫారెస్ట్ అధికారులు తిరుమలేష్ తో పాటు అతని అనుచరులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు నిజం ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 8న అడవిలో రెక్కీ నిర్వహించి.. సోమవారం(ఫిబ్రవరి 10) సాయంత్రం గుప్త నిధుల తవ్వకాల కోసం అడవిలోకి వెళ్లినట్టు విచారణలో చెప్పారు.
తిరుమలేష్ నాయుడు గతంలో రెండు కేసుల్లో రిమాండ్‌కు కూడా వెళ్లి బెయిల్‌పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ మార్చిస్తానని చెప్పి.. ఓ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి పలువురిని మోసం చేసిన కేసులో తిరుమలేష్ రిమాండ్‌కు వెళ్లారు. అంతకుముందు నార్సింగిలోని ఓ భూ సెటిల్మెంట్ విషయంలోనూ జైలుకెళ్లి వచ్చారు. ఈ రెండు కేసులపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇంతలో తిరుమలేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలేష్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. గతంలోనూ ఇలా గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. తిరుమలేష్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధం. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. గుప్తనిధుల పేరుతో పురాతన ఆలయాలను, కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. చారిత్రక అనవాళ్లను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఇలాంటి ముఠాలు చాలానే ఉన్నాయి. రహస్యంగా గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. ఓ రాజకీయ నేత ఇలాంటి ముఠాలో సభ్యుడు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.