Police Constable: కానిస్టేబుళ్ల కక్కుర్తి.. అర్ధరాత్రి జంటను బెదిరించి..

ఇటీవల అర్ధరాత్రి పూట ఒక జంటను బెదిరించి, వాళ్ల దగ్గరి నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు హోంగార్డు, కానిస్టేబుల్.

Police Constable: కానిస్టేబుళ్ల కక్కుర్తి.. అర్ధరాత్రి జంటను బెదిరించి..

Police Constable

Updated On : April 20, 2022 / 5:26 PM IST

Police Constable: జనాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డ్, కానిస్టేబుల్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ఘటన వెలుగుచూసింది. ఇటీవల అర్ధరాత్రి పూట ఒక జంటను బెదిరించి, వాళ్ల దగ్గరి నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు హోంగార్డు, కానిస్టేబుల్.

Crime news : పోర్న్ వీడియోలు చూసి.. భార్యను హత్యచేసిన భర్త.. అసలేం జరిగిందంటే?

గూగుల్ పే ద్వారా ఈ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు మళ్లీ బెదిరించి, ఇంకొన్ని డబ్బులు వసూలు చేసుకున్నారు. చివరకు వీళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో బాధితులు స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వసూళ్లకు పాల్పడ్డ హోంగార్డు, కానిస్టేబుల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.