Red Sandal Smuggler : పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్

కడప జిల్లా‌కు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Red Sandal Smuggler : పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్

International Red Sandal Smuggler Arrest

Updated On : October 9, 2021 / 1:41 PM IST

Red Sandal Smuggler : కడప జిల్లా‌కు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారు ఝామున  కుప్పం-కృష్ణగిరి హైవేలో ఎర్ర చందనాన్ని లారీలో తరలిస్తుండగా రామనాథ రెడ్డితో పాటు అతని అనుచరులు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకితీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

శనివారం తెల్లవారుఝామున అందిన విశ్వసనీయ సమాచారంతో  పోలీసులు జాతీయ రహాదారిపై నిఘా పెట్టి 12 టైర్ ల లారీలో తరలిస్తున్న 62 ఎర్ర చందనం దుంగలను… వాటికి ఎస్కార్ట్ గా స్కార్పియో వాహనంలో అనుచరులతో వెళుతున్న స్మగ్లర్ రామనాథ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Hyderabad Heavy Rains : సినిమా ధియేటర్లోకి వర్షపు నీరు… గోడ కూలి 50 బైక్ లు ధ్వంసం

రామనాథరెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని .. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లలో రామనాథరెడ్డి ఒకడని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసు కొన్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనాల విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.