దిశ సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు: ఎక్కడ దొరికిందంటే?

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 07:41 AM IST
దిశ సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు: ఎక్కడ దొరికిందంటే?

Updated On : December 5, 2019 / 7:41 AM IST

హత్యాచారానికి బలైపోయిన దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు.

దిశపై క్రూర మృగాలు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నిందితులపై ఏ మాత్రం కనికరించవద్దనీ..ఇటువంటి మావన మృగాలు సభ్య సమాజంలో తిరగటానికి వీల్లేదని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఇటువంటి క్రూరుల్ని మేమే చంపేస్తామని ఆగ్రహావేశాల్ని వెళ్లగక్కుతున్నారు. 

ఈ క్రమంలో దిశ కేసులో మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం (డిసెంబర్ 4) హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.