బేగంపేట లిస్బన్ పబ్ లో అశ్లీల కార్యక్రమాలు
హైదరాబాద్ లోని బేగంపేట్ లిస్బన్ పబ్ లో అశ్లీల కార్యక్రమాలు వెలుగు చూశాయి. అమ్మాయిలకు జీతాలు ఇచ్చి నిర్వహకులు అసభ్యకర పనులు చేయిస్తున్నారు.

హైదరాబాద్ లోని బేగంపేట్ లిస్బన్ పబ్ లో అశ్లీల కార్యక్రమాలు వెలుగు చూశాయి. అమ్మాయిలకు జీతాలు ఇచ్చి నిర్వహకులు అసభ్యకర పనులు చేయిస్తున్నారు.
హైదరాబాద్ లోని బేగంపేట్ లిస్బన్ పబ్ లో అశ్లీల కార్యక్రమాలు వెలుగు చూశాయి. అమ్మాయిలకు జీతాలు ఇచ్చి నిర్వహకులు అసభ్యకర పనులు చేయిస్తున్నారు. అమ్మాయిలకు నజరానా ఇచ్చి పబ్ కు వచ్చిన వారితో మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. కస్టమర్లకు అమ్మాయిలను ఎరగా వేసి.. భారీగా ఆదాయం దండుకుంటున్న లిస్బన్ పబ్‌పై.. అర్ధరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
36 మంది అమ్మాయిలు, అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. పబ్ ఆదాయం పెంచుకునేందుకు.. కొంతకాలంగా యువతులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్నారు. వారికి జీతాలిచ్చి మరీ.. పబ్‌కు రప్పిస్తున్నారు. యువకులను ఎంటర్‌టైన్ చేయడమే వారి పనిగా మారిపోయింది. అలా వినోదం పంచిన అమ్మాయిలకు.. లిస్బన్ పబ్ ప్రతి రోజూ నజరానాలిస్తోంది.
యువకులతో మద్యం కొనుగోలు చేయిస్తే.. భారీ గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు చేయించేందుకు.. లిస్బన్ పబ్.. పదుల సంఖ్యలో అమ్మాయిలను నియమించుకుంది. ఈ విషయాలన్నీ బయటపడటంతో.. అధికారులు పబ్‌ను సీజ్ చేశారు.