Punjab Serial Killer Arrest : 18 నెలల్లో 11 మందిని హత్య చేసిన ‘సీరియల్ కిల్లర్’ అరెస్ట్.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..!
Punjab Serial Killer Arrest : పంజాబ్‌లో 18 నెలల్లో 11 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయ్యాడు. మొదట హత్య చేసి, ఆపై మృతుల పాదాలను తాకి క్షమించమని కోరేవాడు.

Punjab Police arrests serial killer ( Image Source : Google Images )
Punjab Serial killer Arrest : పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఓ సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి దారినపోయే వ్యక్తులకు లిఫ్ట్‌లు ఇచ్చి, మొదట వారిని దోపిడీ చేసి ఆపై వారిని చంపేవాడు. ఈ సీరియల్ కిల్లర్ 18 నెలల్లో మొత్తం 11 మందిని హత్య చేశాడు. నిందితుడిని హోషియార్‌పూర్‌లోని గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన రామ్ సరూప్ (33)గా గుర్తించారు.
డబ్బు కోసం దారుణ హత్యలు :
పోలీసులు కథనం ప్రకారం.. బాధితులంతా పురుషులే.. వారికి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత అతడు వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆ తర్వాత బాధితుల నుంచి వస్తువులు, డబ్బులను దోచుకునేవాడు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించినా, గొడవ పడినా వారిని చంపేవాడు. చాలా కేసుల్లో నిందితుడు బాధితులను గుడ్డతో గొంతుకోసి చంపాడని, మరికొన్ని కేసుల్లో తలకు గాయాలై చనిపోయారని పోలీసులు తెలిపారు.
విచారణలో మరో 10 హత్యలు వెలుగులోకి :
11 హత్యల్లో నిందితుడైన రామ్ సరూప్ అలియాస్ సోధిని రూప్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరో 10 హత్యలు వెలుగులోకి వచ్చాయి. అదే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లాలోని చౌరా గ్రామంలో అరెస్టు చేశామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా వెల్లడించారు. జిల్లా రూప్‌నగర్‌లో జరిగిన క్రూరమైన నేరాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఈ బృందం 18 ఆగస్టు 2024న కిరాత్‌పూర్ సాహిబ్‌లో జరిగిన మణిందర్ సింగ్ హత్యపై దర్యాప్తు చేస్తోంది. మనీందర్ సింగ్ టోల్ ప్లాజాలో పనిచేసేవాడు. అతని మృతదేహం పొదల్లో కనిపించింది. సాంకేతిక విచారణ అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
లిఫ్ట్ పేరుతో బాధితులను తీసుకెళ్లి హత్యలు :
అరెస్టు తర్వాత విచారణలో నిందితుడు 11 మందికి లిఫ్ట్ ఇచ్చి హత్యలు చేసినట్టుగా అంగీకరించాడు. వారిని లైంగికంగా వేధించి డబ్బులు, వస్తువులను దోచుకుని హత్య చేసేవాడు. రూప్‌నగర్‌లో మరో రెండు హత్యలతో సహా మరో 10 హత్యలను చేసినట్టు పోలీసుల విచారణలో బయటపెట్టాడు. ఇదే నిందితుడు ముకందర్ సింగ్ అలియాస్ బిల్లాను ఏప్రిల్ 5, 2024న, హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ సన్నీని జనవరి 24, 2024న కొట్టి చంపాడు.
దీంతో పాటు ఫతేఘర్ సాహిబ్, హోషియార్‌పూర్ జిల్లాల్లో కూడా అనేక నేరాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అని, లైంగికంగా పాల్పడంతో పాటు డబ్బు డిమాండ్ చేసేవాడని ఎస్‌ఎస్పీ ఖురానా తెలిపారు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే, అతను వారిని చంపి వస్తువులను దొంగిలించేవాడు.
స్వలింగ సంపర్కడని కుటుంబం వదిలేసింది :
కూలీ పనులు చేసుకునే నిందితుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు అధికారులు తెలిపారు. సీరియల్ కిల్లర్ ప్రకారం.. హత్య చేసిన తర్వాత అతను మృతుల పాదాలను తాకి, క్షమాపణలు కోరతాడు. డ్రగ్స్ సేవించిన తర్వాతే ఈ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అయితే, ఇదంతా అతనికి గుర్తులేదు. నిందితుడికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, అతడు స్వలింగ సంపర్కం కారణంగా అతని కుటుంబం రెండేళ్ల క్రితమే వెలివేసిందని సమాచారం.
Read Also : Venu Swamy – Allu Arjun : అల్లు అర్జున్ జాతకం అప్పటిదాకా బాగోలేదు.. బన్నీ జాతకం చెప్పిన వేణుస్వామి..