నగరంలో ఆటోలకు క్యూఆర్ కోడ్
ఆటోల్లో ప్రయాణం ఇక భద్రం

ఆటోల్లో ప్రయాణం ఇక భద్రం
హైదరాబాద్: నగరంలో ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా నగర పోలీసులు ఆటోలకు క్యూ ఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. నగరంలో దాదాపు 1లక్షా 40వేల ఆటోలు ఉన్నాయి. వీటికి సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి సమగ్ర సమాచారంలేదు. ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనితో పాటు ఈ చలాన్లు పేరుకు పోవటం కూడా ట్రాఫిక్ పోలీసులకు కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ కీలకనిర్ణయం తీసుకుకున్నారు.
నగరంలోని అన్ని ఆటోలకు సంబంధించిన, ఆటో డ్రైవర్లకుసంబంధించిన పూర్తి డేటా బేస్ సిధ్దం చేస్తున్నారు. దీనితో పాటు ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్ తో ఉన్న పోలీస్ నంబరు కేటాయిస్తారు. వీటితో పాటు ఆటోలోపలి వైపు నేమ్ ప్లేట్ ఏర్పాటు చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్, కోడ్స్ జారీ విధానానికి ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ అని పేరు పెట్టారు.
ఆర్టీఏ ఆఫీసులో ఉన్న రికార్డుల ప్రకారం 50 శాతంఆటోలు కూడా సరైన అడ్రస్ లోలేవు. నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయనిఅడిగితే కరెక్టు గా సమాధానం చెప్పలేని పరిస్ధితి లో అధికారులు ఉన్నారు. నగరంలో బోగస్ రిజిష్ట్రేషన్ తో తిరుగుతున్నవాహనాలు 40 శాతం వరకు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఇస్తున్న చిరునామాలు పక్కానా కాదా అనేది చెక్ చేసుకోటానికి అవసరమైన సిబ్బంది వనరులు ఆర్టీఏ వద్దలేవు.
మొత్తంగా ఆలోచిస్తే ఆటోలస డేటా బేస్ ఉంటే కొంత వరకు నేరాలు అదుపు చేయవచ్చని, బోగస్ వాహనాలను అరికట్టవచ్చని భావించిన పోలీసులు జనవరి 17 నుంచి దీనిపై ప్రత్యేక డ్రయివ్ చేపడుతున్నారు.
ఈ డ్రయివ్ లో ఆటో డ్రయివర్లేస్వచ్చందంగా ముందుకు వచ్చి వివరాలు ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకోసం ఈ నెల 17 నుంచి గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రత్యేక కేంద్రాలు పని చేయనున్నాయి. ఈ వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి పీడీఏ మిషన్లను అనుసంధానించి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేయించాలని భావిస్తున్నారు. అసలు వివరాలు ఇవ్వని, తప్పుడు వివరాలు అందించిన వారిని గుర్తించి అప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆటోల్లో అనేకం ఒకరి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంటే… వాటిని అద్దెకు తీసుకుని, పర్మిట్ ఆధారంగా నడిపే వారు వేరే వ్యక్తులు ఉంటున్నారు. డ్రైవర్లు ఆర్సీ వివరాలు, పర్మిట్ వివరాలతో వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ దరఖాస్తుతో పాటు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్‌తో పాటు ఓనర్ల గుర్తింపుకార్డులు సమర్పించాలి.
ఈ నెల 17 నుంచి గోషామహల్, బేగంపేట టీటీఐల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు పనిచేస్తాయి.