Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు

Medchal Road Accident

Updated On : October 7, 2023 / 11:15 AM IST

Road Accident In Medchal District : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు భువేష్ (17), తుషార (18) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also : Road Accident : డ్రంకెన్ డ్రైవ్ నిండు ప్రాణం తీసింది.. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్

కీసర చౌరస్తా నుంచి యాద్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలలీనో కారు అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో కారులో ఐదు మంది ఉన్నారు. వారిలో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు. భువేష్, తుషార మృతిచెందగా, పిలిప్స్, రుబిన్, యువతి హరిప్రియలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అల్వాల్ బొల్లారం ప్రాంతంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన ముగ్గురిని కీసరలోని లైఫ్ సేవ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.