Road Acccident : రోడ్డు ప్రమాదం-ప్రియురాలు మృతి-ప్రియుడు ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఈ తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

Road Acccident : రోడ్డు ప్రమాదం-ప్రియురాలు మృతి-ప్రియుడు ఆత్మహత్య

West Godavari Road Accident

Updated On : December 4, 2021 / 4:26 PM IST

Road Acccident :  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఈ తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీడీ కాలనీలో నివసించే జంట ఈ తెల్లవారు ఝూమున వేరే ఊరు నుంచి ద్విచక్ర వాహానంపై ఏలూరు వస్తున్నారు.
Also Read : Yasangi Paddy Crop : యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు-ప్రశాంత్‌రెడ్డి
ఏలూరు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహానం ఢీకొని మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమెతో  పాటు వస్తన్న వ్యక్తి ఇంటికి  వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ వివాహేతర సంబంధంలో సహజీవనం  చేస్తున్నారని తెలిసింది. రూరల్ పోలీసులు ఘటనా స్ధలాలకి  చేరుకుని రెండు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.