సినిమా స్టంట్ కాదు.. రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిపడ్డ వృద్ధులు.. వీడియో వైరల్
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kerala Road Incident (Photo Credit : Google)
Kerala Road Incident : రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. దేశంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు వ్యక్తులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఏ తప్పు చేయని అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు. కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తీరు భయానకంగా ఉంది. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్న వృద్ధులను బలంగా ఢీకొట్టింది. కారు ఎంత వేగంగా ఢీకొట్టిందంటే.. వృద్ధులు గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో వారిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు.
కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా కొడువాయూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వృద్ధ జంట రోడ్డు దాటే ప్రయత్నంలో ఉంది. రోడ్డుపై వాహనాలు వస్తుండటంతో వారు రోడ్డు పక్కన నిల్చున్నారు. వాహనాలు వెళ్లాక రోడ్డు క్రాస్ చేద్దామని భావించారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగింది. అటు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. వృద్ధులను బలంగా ఢీకొట్టింది. అది ఎంత వేగంగా ఢీకొట్టిందంటే.. వృద్ధులు ఇద్దరూ గాల్లోకి ఎగిరారు. అక్కడి నుంచి కొన్ని మీటర్ల దూరంలో వారిద్దరూ పడిపోయారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగి వాహనం నడపటంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మృతులను సామి(65), అతడి భార్య జాను(60)లుగా గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. మద్యం తాగి డ్రైవింగ్ చేసి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రోడ్డు క్రాస్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాల రాకపోకలను గమనించాలి. అంతా సురక్షితం అనుకున్నప్పుడే రోడ్డును క్రాస్ చేయడం మంచిది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
கார் மோதி தூக்கி வீசப்பட்ட இருவர்.. அதிர்ச்சியூட்டும் சிசிடிவி காட்சி.!#Kerala #CCTV #CarAccident #ViralVideo #Accident #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/uxTDjIbVjB
— News Tamil 24×7 (@NewsTamilTV24x7) November 23, 2024
Also Read : బీ కేర్ ఫుల్.. అక్కడ.. గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఇదో ఘరానా మోసం..