మెయిన్ రోడ్డులోనే : బెజవాడలో శ్రీచైతన్య స్కూల్ బస్సు బీభత్సం

విజయవాడ బీఆర్‌టీఎస్ రహదారి. ఈ రోడ్డుపై రద్దీ ఉంటుంది. ఉదయం వేళల్లో స్కూల్‌కు..ఆఫీసులకు..ఇతరత్రా పనులకు వెళ్లే వారితో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలపైకి రయ్యిమంటూ దూసుకెళ్లింది. దీనితో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ చైతన్య స్కూల్‌కి చెందిన బస్సు అతి వేగంతో ప్రయాణించింది. తొలుత రోడ్డుపైనున్న ఓ బారికేడ్‌ను ఢీకొంది. చౌరస్తా వద్ద కూరగాయాల లోడ్‌తో వెళుతున్న ఓ రిక్షా..పక్కనే ఉన్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొంది. రిక్షాపై ఉన్న ఇద్దరు కిందపడిపోయారు. కూరగాయాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే వేగంతో ముందు వెళుతున్న ఆటోను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీనితో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ప్రమాద దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.