Molestation : దారుణం.. అమ్మాయిలను రూమ్‌లోకి పిలిచి స్కూల్ ప్రిన్సిపల్ వికృత చేష్టలు, బాధితుల్లో 142మంది ఆడపిల్లలు

School Principal Molestation : గత ఆరేళ్లుగా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసి అంతా షాక్ కి గురయ్యారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

Molestation : దారుణం.. అమ్మాయిలను రూమ్‌లోకి పిలిచి స్కూల్ ప్రిన్సిపల్ వికృత చేష్టలు, బాధితుల్లో 142మంది ఆడపిల్లలు

School Principal Molestation (Photo : Google)

స్కూల్ అంటే పవిత్రమైన దేవాలయంలా చూస్తారు. గురువుని దైవంతో పోలుస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువులే. అందుకే విద్యను బోధించే టీచర్ కి ఈ సమాజంలో అంత గౌరవం ఇస్తారు. అయితే కొందరు గురువులు దారి తప్పుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. విచ్చలవిడి లైంగిక కోరికలతో అమ్మాయిలను వేధిస్తున్నారు. కోరిక తీర్చాలంటూ విద్యార్థులను టార్చర్ పెడుతున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ కీచకుడిలా మారాడు. ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు.

142 మంది బాధితులు..
10 మంది కాదు 20 మంది కాదు.. ఏకంగా 142మంది ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు కీచక ప్రిన్సిపల్(55). అతడి వేధింపులు భరించలేకపోయిన అమ్మాయిలు చివరికి అధికారులను ఆశ్రయించారు. కీచక ప్రిన్సిపల్ పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచకుడిని అరెస్ట్ చేశారు. జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘోరం వెలుగుచూసింది.

ఆడపిల్లలను రూమ్ లోకి పిలిచి వికృత చేష్టలు..
స్కూల్ ప్రిన్సిపల్ తమను లైంగికంగా వేధించాడని తొలుత 60మంది ఆడపిల్లలు ఫిర్యాదు చేశారు. తాజాగా బాధితుల సంఖ్య 142కి పెరిగింది. మేము కూడా బాధితులమే అంటూ మరికొందరు అమ్మాయిలు బయటకు వచ్చారు. ప్రిన్సిపల్ తమను తన రూమ్ లోకి పిలిచి వికృత చేష్టలకు పాల్పడే వాడని, లైంగికంగా వేధించే వాడని అమ్మాయిలు వాపోయారు.

Also Read : బిర్యానీ కోసం యువకుడిని హత్య చేసిన బాలుడు .. మృతదేహం పక్కనే డ్యాన్స్

ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. కీచక ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గత 6ఏళ్లుగా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

రాష్ట్రపతి, ప్రధానిలకు అమ్మాయిల లేఖ..
తొలుత 15మంది ఆడపిల్లలు రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ ఉమెన్ కమిషన్, స్టేట్ ఉమెన్ కమిషన్ కు లేఖ రాశారు. ప్రిన్సిపల్ లైంగిక వేధింపుల గురించి అందులో ప్రస్తావించారు. తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. పోలీసులు కీచకుడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు.

Also Read : కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం

ఆ తర్వాత మరింత మంది బాధిత విద్యార్థినులు బయటకు వస్తున్నారు. అలా ఇప్పటివరకు బాధితుల సంఖ్య 142కి పెరిగింది. గత ఆరేళ్లుగా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసి అంతా షాక్ కి గురయ్యారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కీచక ప్రిన్సిపల్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.