షాహిన్ బాగ్ లో ఉద్రిక్తం : 144 సెక్షన్ విధింపు

ఢిల్లీ షాహీన్‌బాగ్ వద్ద హై అలర్ట్ నెలకొంది. గత రెండున్నర నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళనా శిబిరం నడుస్తోంది..ఐతే ఇక్కడి శిబిరాన్ని ఖాళీ చేయించాలంటూ హిందూసేన పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.. పోలీసులు రంగంలోకి దిగి 144 సెక్షన్ విధించారు.
ఇలాంటి సంఘటలతోనే ఢిల్లీ మౌజ్‌పురాలో మొదలైన అల్లర్లు నార్త్ఈస్ట్ ఢిల్లీ అంతా వ్యాపించి విధ్వంసానికి దారి తీశాయి.ఈ నేపధ్యంలోనే పోలీసులు షాహీన్‌బాగ్ ఏరియాలో భారీగా మోహరించారు.. షాహీన్ బాగ్ లో శాంతిభద్రతలను జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీవాత్సవ పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే వారం క్రితం చోటు చేసుకున్న అల్లర్లను రిపీట్ కానివ్వబోమని చెప్పారాయన.
జాతీయ పౌరసత్వసవరణ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందింది మొదలు..కొన్ని వర్గాలు షాహీన్‌బాగ్ రోడ్డుపైనే నిరసనకు దిగాయ్..రోజులు గడుస్తున్నా కూడా తమ ఆందోళన విరమించలేదు.. అలా 80 రోజులుగా ధర్నా చౌక్ లో తమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు..పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వం కల్పించడం, అక్కడి నుంచి వచ్చే ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడం, ముఖ్యంగా ముస్లింల పట్ల బిజెపి వివక్ష చూపిస్తోందంటూ వీరు ప్రధానంగా ఆందోళనకు దిగారు.
ఈ నేపధ్యంలోనే షాహీన్‌బాగ్ వద్ద శిబిరం తొలగించాలని హిందూసేన డిమాండ్ చేసింది.. దీంతో ధర్నా చౌక్ ఏరియావద్ద ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఎన్నికలు జరిగినా..ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అక్కడి నుంచి శిబిరాన్ని తొలగించి..వేరే చోట ధర్నా చేసుకోవచ్చని చెప్పినా..తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కేసు ఒకటి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది..ఢిల్లీలో గత వారం చోటు చేసుకున్న అల్లర్ల నేపధ్యంలో హిందూసేన, షాహీన్‌బాగ్ ఆందోళనకారుల మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకుంటాయో అనే టెన్షన్ ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు ప్రారంభమైంది.