Viral Video : మహిళతో బలవంతంగా మసాజ్.. అడ్డంగా బుక్కయిన పోలీసు అధికారి.. వీడియో

Viral Video : ఓ పోలీసు అధికారి మసాజ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళతో బలవంతంగా మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : మహిళతో బలవంతంగా మసాజ్.. అడ్డంగా బుక్కయిన పోలీసు అధికారి.. వీడియో

Seeking Bail For Her Son, Bihar Woman Made To Massage Cop At Police Station (1)

Updated On : April 29, 2022 / 1:14 PM IST

Viral Video : ఓ పోలీసు అధికారి మసాజ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళతో బలవంతంగా మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్‌ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దాహర్‌ అవుట్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే పోలీసు అధికారి ఇలా మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడు. ఆ మహిళను అవుట్ పోస్టులోని రెసిడెన్షియల్ క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడు.. అంతటితో ఆగకుండా ఆమెతో బలవంతంగా మసాజ్ చేయించుకున్నాడంటూ వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.

గదిలో తన షర్ట్ తీసేసి మహిళతో ఒళ్లు మసాజ్ చేయించుకున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వైరల్ అయ్యే వీడియోలో పోలీసు అధికారి శశిభూషణ్ సిన్హా ఫోన్లో ఏదో సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించాడు. బాధిత మహిళ తన కుమారుడి బెయిల్ ఇచ్చే విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే అధికారి ఆమెతో బలవంతంగా మసాజ్ చేసుకోవడం విమర్శలపాలు చేసింది.

శశిభూషణ్ మసాజ్ చేయించుకుంటున్న సమయంలో ఎవరో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు అధికారిపై వేటు పడినట్టు తెలిసింది. ఈ ఘటనపై ఇప్పటివరకూ బీహార్ పోలీసు శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు.

Read Also : Guntur : ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం