దిశ ఘటన మరువక ముందే మరో దారుణం : బాలికపై అత్యాచారం
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నడిరోడ్డుపై వారిని చంపాలని నినదిస్తున్నారు. అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా.. కొందరు మృగాళ్ల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఆడవారిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఆఖరికి పిల్లలను కూడా వదలడం లేదు.
విజయవాడ భవానీపురంలో మరో దారుణం జరిగింది. మైనర్ బాలిక(17)పై అత్యాచారం జరిగింది. ఏడుగురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూల డెకరేషన్ కోసం వెళ్లిన బాలికపై సాయి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. సాయితో పాటు అతడి స్నేహితులు కూడా.. అత్యాచారం చేశారు. బాలిక.. తన తల్లికి చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి సహా.. అతని స్నేహితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలిది కొత్తపేట వాగు సెంటర్. తండ్రి లేడు. పూల డెకరేషన్ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సాయి అనే వ్యక్తి బాలికను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ విషయం తెలిసిన సాయి స్నేహితులు సైతం బాలికపై లైంగిక దాడి చేశారు. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఓవైపు దేశవ్యాప్తంగా.. దిశ ఘటనతో నిరసనలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఇలాంటి ఘోరాలు పునరావృతం అవుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.