Road Accident Seven Died : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు స్పాట్ డెడ్
కర్ణాటకలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం రాత్రి బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతించారు.

road accident
Road Accident Seven Died : కర్ణాటకలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం రాత్రి బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. గాయపడిన వారిలో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా కూలీలు. కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.