Shocking Video : వీడిని ఏం చేసినా పాపం లేదు.. వ్యూస్ కోసం రైల్వే ట్రాక్ పై ఏం చేశాడో చూడండి..

Snake Firecrackers On Train Tracks : వ్యూస్ కోసం లైక్స్ కోసం పాపులారిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Shocking Video : వీడిని ఏం చేసినా పాపం లేదు.. వ్యూస్ కోసం రైల్వే ట్రాక్ పై ఏం చేశాడో చూడండి..

YouTuber Bursts Snake Firecrackers On Train Tracks (Photo : Google)

Updated On : November 8, 2023 / 7:27 PM IST

ఒక్క వీడియో జీవితాలనే మార్చేస్తుంది. రాత్రికి రాత్రి పాపులర్ చేస్తుంది. సామాన్యులు సైతం సెలబ్రిటీలు అయిపోతారు. సోషల్ మీడియాకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే చాలు ఇక తిరుగుండదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు చాలామందే ఉన్నారు. అందుకే ఇప్పుడు యువత సోషల్ మీడియాకు అంతగా అడిక్ట్ అయిపోయింది. ఇటీవలి కాలంలో రీల్స్, షార్ట్ వీడియోలపై బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

అయితే.. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లలో అత్యధిక వ్యూస్ కోసం కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. కొంతమంది కంటెంట్‌ను నమ్ముకుంటుంటే మరికొందరు ప్రమాదకరమైన ఫీట్స్‌ను నమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తోటి వారి ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రజల ప్రాణాలతో అతడు చెలగాటం ఆడిన వైనం కోపం తెప్పిస్తోంది.

Also Read : షాకింగ్.. అడల్ట్ వీడియో చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు యాక్టర్లు

ఓ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా.. రైల్వే ట్రాక్ పై బాణసంచా కాల్చాడు. రైల్వే ట్రాక్ మధ్యలో బ్లాక్ స్నేక్ పటాసులు ఉంచాడు. ఆ తర్వాత దానికి నిప్పు పెట్టాడు. అందులో ఉంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. భారీగా పొగ అలుముకుంది. దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు.

రాజస్తాన్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పులేరా అజ్మీర్ సెక్షన్ దంత్రా స్టేషన్ దగ్గర ఆ యూట్యూబ్ ఈ పని చేశాడు. వీడియో 33 సెకన్ల నిడివితో ఉంది. రైల్వే ట్రాక్ పై పటాసులు ఉంచి కాల్చడమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు ఆ యూట్యూబర్. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ఆ యూట్యూబర్ తీరుపై అంతా మండిపడుతున్నారు. ఇలాంటోళ్లను ఏం చేసినా పాపం లేదంటున్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం పాపులారిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రైలులో వందల సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో తీవ్ర వివాదాస్పదం అయ్యింది. పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆ యూట్యూబర్ ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.

Also Read : ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్

”రైల్వే ట్రాక్‌లపై క్రాకర్స్ పేల్చుతున్న యూట్యూబర్. ఇటువంటి చర్యలు అగ్ని రూపంలో తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయవచ్చు. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి” అని ఓ నెటిజన్ రైల్వే పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోపై ప్రజలు తీవ్రంగా ప్రతి స్పందించారు. సదరు యూట్యూబర్ అజాగ్రత్త చర్యను తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా? ఏకంగా భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే

పాము పటాసులు రైల్వే ట్రాక్‌లకు హాని కలిగించకపోవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరం. అంతేకాదు పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. రైలు పట్టాల దగ్గర ఎలాంటి ప్రయోగాలు చేయవద్దు. అది ప్రమాదకరం అని ఒక నెటిజన్ తన అభిప్రాయం తెలిపారు. ”ఇలాంటి చర్యలు పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. కచ్చితంటా ఇలాంటోళ్లను శిక్షించాల్సిందే” అని మరొక నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘స్నేక్ క్రాకర్ చాలా చెత్త క్రాకర్. ఇది వాతావరణంలోకి అత్యంత ఎక్కువ కార్బన్‌ను విడుదల చేస్తుంది. క్రాకర్ల తయారీదారులను, అమ్మకాలను నియంత్రించాలి’ అని మరో నెటిజన్ డిమాండ్ చేశాడు.

దీపావళి సందర్భంగా పిల్లలు ఆడుకునే ఒక నల్ల పాము(స్నేక్ క్రాకర్) భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పటాకు. 2016లో, చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF) మరియు పూణే విశ్వవిద్యాలయం ఒక పరిశోధనను నిర్వహించాయి. ఈ బాణసంచాను కాల్చే సమయంలో అత్యధిక మొత్తంలో PM2.5 విడుదల చేస్తుందని కనుగొన్నారు.