Nellore Incident : ఈతకు వెళ్లి చెరువులో ఆరుగురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాలు వెలికితీత

నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.

Nellore Incident : ఈతకు వెళ్లి చెరువులో ఆరుగురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాలు వెలికితీత

MISSING

Updated On : February 27, 2023 / 1:29 PM IST

Nellore Incident : నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది. కళ్యాణ్, ప్రశాంత్, రఘు, శ్రీనాథ్, బాలాజీ మృతదేహాలను చెరువులో నుంచి గజ ఈతగాళ్లు, స్థానికులు బయటికి తీసుకువచ్చారు. మరో యువకుడు సురేంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మొత్తం పది యువకులు నిన్న (ఆదివారం) సాయంత్రం బోటుపై షికారుకు వెళ్లారు. బోటు తిరగబడటంతో యువకులు నీటిలో పడిపోయారు. అందులో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు చెరువులో గల్లంతయ్యారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. యువకులు గల్లంతుపై విచారం వ్యక్తం చేశారు.

Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

తమ గ్రామంలో ఇంత పెద్ద ఘటన మునుపెన్నడూ జరగలేదన్నారు. ప్రమాదం ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి బాధితు కుటుంబాలను ఆదుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు లభ్యమైన మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.