‘నాన్నా నీకో సర్ ప్రైజ్ ఇస్తా‘ అని చెప్పింది.. తండ్రి కోసం కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనింది.. కానీ, విధి మరోలా ఉంది..
Software Employee : తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు బయల్దేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రోడ్డుప్రమాదంలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగిందంటే?

Software Employee
Software Employee : ప్రతి కూతురికి తండ్రి అంటే ఎంతో ఇష్టమే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి బాగా చదివించి తనను ఉన్నతస్థాయికి చేర్చిన తండ్రిని మంచిగా చూసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు అలానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన తండ్రి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది. తండ్రికి బైక్ సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రుకు చెందిన చెదే జనార్దన్‌కు కుమార్తె యశస్విని (24), ఒక కుమారుడు ఉన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కంపెనీలో యశస్విని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. తన తండ్రిని సర్‌ఫ్రైజ్ చేయాలనుకుంది. బైక్‌పై తోటి ఉద్యోగితో కలిసి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరింది.
అయితే, అర్ధరాత్రి సమయంలో మునగాలలోని ఆకుపాముల వద్ద రహదారిపై చనిపోయిన గేదెను గుర్తించక బైక్ ఢీకొట్టి పడిపోయింది. అప్పుడే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ యశస్వినిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
వాహనం నడిపే నాగఅచ్యుత్ కుమార్‌కు గాయాలయ్యాయి. వెంటనే కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడని తెలిపారు.