Cars Stolen: అద్దెకు కార్లను తీసుకుని అమ్ముకుంటున్న ఇద్దరు అరెస్ట్

యజమానుల నుంచి కార్లను సేకరించి ఆపై వాటిని అమ్ముకుంటున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Cars Stolen: అద్దెకు కార్లను తీసుకుని అమ్ముకుంటున్న ఇద్దరు అరెస్ట్

Crime

Updated On : January 14, 2022 / 9:59 PM IST

Cars Stolen: సులభ మార్గంలో డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుని కటకటాల పాలవుతున్నారు కొందరు వ్యక్తులు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కోర్టులు ఎంత శిక్ష విధించినా ఇటువంటి వారిలో మార్పు రావడంలేదు. కారు కిరాయికి ఇస్తే ఎక్కువ అద్దె ఇస్తామంటూ నమ్మబలికి యజమానుల నుంచి కార్లను సేకరించి ఆపై వాటిని అమ్ముకుంటున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పురానీహవేలీ పోలీసుల కధనం ప్రకారం పాతబస్తీ కిషన్ బాగ్ కు చెందిన సల్మాన్, హుస్సేన్ అనే ఇద్దరు యువకులు కార్ రెంటల్ నిర్వహిస్తుండేవారు.

Also read: Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణం

ఈక్రమంలో వీరిరువురు పలువురు కార్ల యజమానుల నుండి కార్లను అద్దెకు తీసుకొని వాటిని ఇతర కంపెనీలకు విక్రయించేవారు. కార్లు అద్దెకు తీసుకుని సమయం గడిచినా తిరిగి ఇవ్వకపోవడంతో పలువురు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వీరిపై నిఘాపెట్టిన పోలీసులు శుక్రవారం నాడు సల్మాన్, హుస్సేన్ లను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల నుండి ముడు కార్లు రెండు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చంద్రాయనగుట్ట, ఆసిఫ్‌నగర్ మరియు ఉప్పల్ పీఎస్‌లలో కేసులు నమోదు అయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also read: Oldest Tortoise: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 190 ఏళ్ల తాబేలు