వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై ఎస్పీ వివరణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు.
కడప : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు. వివేకా హత్యకు సంబంధించిన ఓ లేఖను జగన్ కుటుంబ సభ్యులే తమకు ఇచ్చారని చెప్పారు. లెటర్‌లో మూడు లైన్‌లు ఉన్నాయిని తెలిపారు. ’నన్ను చంపుతారు తొందరగా రా’.. అని లేఖలో రాసి ఉందన్నారు. జగన్ సమక్షంలోనే కుటుంబసభ్యులు లేఖను తమకు అందజేశారని వెల్లడించారు. లెటర్‌పై రక్తపు మరకలు ఉన్నాయన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. డ్రైవర్‌ను విచారిస్తున్నామని తెలిపారు.