విషాదం : 5కె రన్ చూడటానికి వచ్చిన విద్యార్థి మృతి 

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 08:35 AM IST
విషాదం : 5కె రన్ చూడటానికి వచ్చిన విద్యార్థి మృతి 

విజయవాడ : కంచికచర్ల శ్రీ చైతన్య స్కూల్ లో విషాదం నెలకొంది. బిల్డింగ్ పై నుంచి కిందపడి విద్యార్థి దుర్మరణం చెందాడు. 5కె రన్ చూడటానికి వచ్చి మృతి చెందాడు. విద్యార్థి మృతితో స్కూల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

వీర్లపాడు మండలం కొణతాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి సాయిబాబా రెడ్డి విజయవాడ కంచికచర్లలోని శ్రీ చైతన్య స్కూల్ లో 8 వ తరగతి చుదువుతున్నాడు. జాతీయ రహదారిపై జరుగుతున్న 5కె రన్ చూసేందుకు సాయిబాబా రెడ్డి స్కూల్ బిల్డింగ్ ఎక్కాడు. బిల్డింగ్ పై నుంచి అదుపు తప్పి పడిపోవడంతో మృతి చెందాడు. వీర్లపాడు మండలం కొణతాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందాడని బాలుడి కటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.