Student Sets Fire : పదో తరగతి పరీక్షల్లో పాస్ కాలేననే భయంతో నిప్పంటించుకున్న విద్యార్థిని
పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. టెన్త్ పరీక్షలు పాస్ కాలేను అనే ఆందోళనతో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

Student Sets Fire
Student Sets Fire : పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. టెన్త్ పరీక్షలు పాస్ కాలేను అనే ఆందోళనతో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జియాగూడలో నివాసం ఉండే రమ్యా దేవి (15) శ్రీనివాస స్కూల్ లో టెన్త్ చదువుతోంది. కాగా, వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షల్లో తాను పాస్ కాలేనని రమ్యాదేవి బెంగ పెట్టుకుంది. ఆందోళనకు గురైంది.
Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్
ఈ క్రమంలో చనిపోవాలని నిర్ణయించుకున్న విద్యార్థిని.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. శనివారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో తన ఇంట్లో తల్లి, చెల్లి వారి వారి పనుల్లో ఉండగా రమ్యాదేవి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల తాకిడిని తట్టుకోలేకపోయిన రమ్యాదేవి బాధతో గట్టిగా కేకలు వేసింది. కూతురి కేకలు విన్న తల్లి పరిగెత్తుకుని వచ్చింది. మంటల్లో ఉన్న కూతురిని చూసి షాక్ తింది. వెంటనే మంటలు ఆర్పివేసింది. గాయాలతో పడి ఉన్న కూతురిని తక్షణమే ఆసుపత్రికి తరలించింది.
Palnadu : మర్డర్ కేసులో సంచలన విషయాలు.. జువెల్లర్స్ నుంచి కల్వర్టు వరకు ఏం జరిగింది ?
ప్రస్తుతం 60 శాతం కాలిన గాయాలతో రమ్యాదేవి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రికి వెళ్లి బాలికను విచారించారు. టెన్త్ పాస్ కాలేనేమో అనే భయంతోనే తాను ఈ పని చేసినట్లు బాధితురాలు తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.