ప్రేయసి ఆత్మహత్య – మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య

ప్రేయసి ఆత్మహత్య – మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య

Updated On : January 24, 2021 / 12:37 PM IST

Telangana boy committed suicide at dubai after hearing girlfriend suicide : ప్రియుడు దుబాయ్ లో ఉన్నాడు. ప్రేమించిన ప్రేయసికి ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. ప్రియుడిని తప్ప వేరే వారిని పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన దుబాయ్ లోని ప్రియుడు, ప్రియురాలు లేని జీవితం వ్యర్ధం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన మానాల రాజేష్‌ (24).. గోవిందపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం రాజేష్‌ దుబాయి వెళ్లాడు. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించు కున్నారు.

ఇంతలో వారి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది. వారు మందలించి, యువతికి వేరే సంబంధాలు చూడటం మొదలెట్టారు.రాజేష్‌ ను ప్రేమించిన యువతి(21) వేరే వారిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న రాజేష్‌.. దుబాయ్‌లో తను ఉంటున్న గదిలోనే ఉరేసుకుని తనువు చాలించాడు. అంతకుముందే తమ ప్రేమ గురించి వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన తల్లికి పంపించాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దుబాయ్ వెళ్లిన కొడుకు జీవతంలో పైకొచ్చి తమ బతుకులు మారుస్తాడని ఆశిస్తే, ప్రేమ పేరుతో అర్ధంతరంగా జీవితాన్ని ముగించటంతో రాజేశ్ కుటుంబ తీవ్ర విచారంలో మునిగిపోయింది.