Priest Molests Minor Girl : మైనర్ బాలికపై గుళ్లో పూజారి అత్యాచార యత్నం

ఒడిషాలోని  భువనేశ్వర్ లోని జగన్నాధ్  స్వామి ఆలయంలోని ఒక ఉప ఆలయంలోని  పూజారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి  వచ్చింది.

Priest Molests Minor Girl :  మైనర్ బాలికపై గుళ్లో పూజారి అత్యాచార యత్నం

Rape Attempt On Girl

Updated On : October 10, 2021 / 12:54 PM IST

Priest Molests Minor Girl : దేశవ్యాప్తంగా మహిళలు, .యువతులు,బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒడిషాలోని  భువనేశ్వర్ లోని జగన్నాధ్  స్వామి ఆలయంలోని ఒక ఉప ఆలయంలోని  పూజారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి  వచ్చింది.

పూరీలోని జగన్నాథ ఆలయంలో సుమారు 136 చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం  హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం  జగన్నాధ్ టెంపుల్ దర్శనానికి వెళ్లింది. అక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో బమనా ఆలయంలో ఆ కుటుంబం పూజలునిర్వహించి బయటకు వచ్చింది.

Also Read : Power Cuts : పండగపూట అంధకారంలోకి భారతదేశం ?

కుటుంబంలోని 12 ఏళ్ల బాలిక మాత్రం ఆలయంలోనే  కూర్చుని ప్రార్ధన చేస్తూ మరి కొంత సేపు ఉన్నది. బాలిక కోసం కుటుంబం బయట వేచి చూస్తూ కూర్చుంది.  ఈ క్రమంలో ఆలయంలో పూజారి సంగ్రామ్ దాస్(27) బాలికపై అత్యాచారం చేయబోయాడు. దీంతో భయపడిన బాలిక పూజారిని విడిపించుకుని  కేకలు వేస్తూ బయటకు పరుగుతీసి తల్లితండ్రులను చేరింది.  వారికి లోపల జరిగిన విషయం వివరించింది.

వెంటనే ఆ కుటుంబం ఆలయం వెలుపల ఉన్న సింఘద్వార్  పోలీసు స్టేషన్‌లో  పూజారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంగ్రామ్  దాస్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను మెజిస్ట్రేట్ ముందు హజరు పరచగా బాలిక తన వాంగ్మూలాన్ని చెప్పింది.