ఇద్దరు మహిళల్ని నిర్భంధించి అత్యాచారం చేసిన ఆలయ పూజారి 

  • Published By: murthy ,Published On : May 19, 2020 / 10:37 AM IST
ఇద్దరు మహిళల్ని నిర్భంధించి అత్యాచారం చేసిన ఆలయ పూజారి 

Updated On : May 19, 2020 / 10:37 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కష్టాలతో ప్రజలంతా ఇంటికే పరిమితమైతే….కామాంధులు అవకాశం ఉన్నంతవరకు మహిళలపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన ఆలయ పూజారి ఉదంతం పంజాబ్ లోని అమృతసర్ లో వెలుగు చూసింది. ఓ దేవాలయం ఆవరణలో తామిద్దరినీ నిర్బంధించి ఆలయ పూజారి పదే పదే అత్యాచారం చేసినట్లు బాధితులు వాపోయారు. 

అమృత్ సర్, లోపోక్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామ్ తీర్ధ కాంప్లెక్స్ లోని గురు జ్ఞాననాధ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్ ప్రధాన పూజారి మహంత్ మోహన్ గిర్దారీనాధ్ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. గిర్దారీనాధ్ తమను నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళలు పంజాబ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యుడు తర్సీంసింగ్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమీషన్ విచారణ చేయమని డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన డీఎస్పీ ఆలయ ఆవరణలోని ఆశ్రమ రహస్య స్ధావరంపై దాడి చేసి ఆలయ ప్రధాన పూజారి మోహన్ గిర్దారీ నాద్, అతని సహచరుడు వరీందర్ నాధ్ లను అరెస్టు చేశారు.

దాడి విషయం పసిగట్టిన పూజారి మరో ఇద్దరు అనుచరులు  పరారీలో ఉన్నారని  వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ అటారీ గురు ప్రతాప్ సింగ్ తెలిపారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి, అతని  సహచరుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Read: వాట్సాప్ వీడియో కాల్ లో నగ్నంగా అమ్మాయి, మాట్లాడితే మూడినట్టే, హైదరాబాద్ లో ఘరానా మోసం