టెన్త్ స్టూడెంట్ హర్షిణి హత్య కేసు : జీవితాంతం బాధపడేలా నిందితుడిని శిక్షించాలని డిమాండ్

జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో టెన్త్‌ విద్యార్థిని హర్షిణి హత్య కేసు సంచలనంగా మారింది. పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. హర్షిణి ఫేస్ బుక్ ఫ్రెండ్ నవీన్ రెడ్డిని అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 10:02 AM IST
టెన్త్ స్టూడెంట్ హర్షిణి హత్య కేసు : జీవితాంతం బాధపడేలా నిందితుడిని శిక్షించాలని డిమాండ్

Updated On : August 29, 2019 / 10:02 AM IST

జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో టెన్త్‌ విద్యార్థిని హర్షిణి హత్య కేసు సంచలనంగా మారింది. పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. హర్షిణి ఫేస్ బుక్ ఫ్రెండ్ నవీన్ రెడ్డిని అరెస్ట్

జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో టెన్త్‌ విద్యార్థిని హర్షిణి హత్య కేసు సంచలనంగా మారింది. పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. హర్షిణి ఫేస్ బుక్ ఫ్రెండ్ నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హర్షిణి మర్డర్ వెలుగులోకి వచ్చాక నవీన్ రెడ్డి కుటుంబసభ్యులు ఊరు వదిలి పారిపోయారు. ఫేస్‌బుక్‌ పరిచయమే హర్షిణి హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నవీన్ రెడ్డి అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా హర్షిణిని పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని రెండుసార్లు కలిశాడు. రెండు రోజుల క్రితం హర్షిణి అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. హర్షిణి కోసం గాలిస్తుండగా.. షాకింగ్ న్యూస్ తెలిసింది. గురువారం (ఆగస్టు 29,2018) ఉదయం జడ్చర్ల మండలం శంకరాయపల్లి దగ్గర హర్షిణి మృతదేహం లభ్యమైంది. దీంతో హర్షిణి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

హర్షిణిని హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హర్షిణి మృతదేహంతో జడ్చర్లలో జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. తాను చేసిన తప్పుకి జీవితాంతం బాధపడేలా నవీన్ ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నవీన్ రెడ్డి హర్షిణిని కలిశాడు. తనతో రావాలని మూడు రోజుల క్రితం కోరాడని హర్షిణి కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత హర్షిణి కనిపించ లేదని, ఇప్పుడు శవమై కనిపించిందని కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.

హర్షిణి తండ్రి జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. నవీన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ వాసి. కారు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. నకిలీ ఫేస్‌బుక్ ఐడీతో హర్షిణిని పరిచయం చేసుకున్నాడు. ఆగస్టు 27న సాయంత్రం హర్షిణి అదృశ్యమైంది.

హర్షిణి హత్య కేసు కలకలం రేపుతోంది. ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసే మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. ఆడపిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫేస్ బుక్ ఫ్రెండ్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవద్దని చెప్పారు.

ఆగస్టు 27న కలుద్దామని హర్షిణికి నవీన్ ఫోన్ చేశాడు. నవీన్ మాటలు నమ్మిన హర్షిణిని ఇంట్లో చెప్పకుండా అతడితో వెళ్లింది. హర్షిణిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నవీన్ అత్యాచారయత్నం చేశాడని, హర్షిణి ప్రతిఘటించడంతో బండరాయితో కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో హర్షిణి కుటుంబసభ్యులు, స్థానికులు శాంతించారు.