Chigurupati Jayaram case : పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు..
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది.

Chigurupati Jayaram Murder case _
Chigurupati Jayaram case : పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది. 2019లో ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లికోర్టు ఎట్టకేలకు తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్దారించింది ధర్మాసనం. దోషిగా తేలిన రాకేష్ రెడ్డికి మార్చి (2023) 9న శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను నిర్ధోషులుగా తేల్చింది. మరో 11 మంది నిందితులపై కేసును కొట్టివేసింది. 2019 జనవరి 30న పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకు గురి అయ్యారు. ఈ కేసుకు సంబందించి పోలీసులు 388 పేజీల చార్జ్ షీజును దాఖలు చేసింది. ఈకేసు నాలుగు సంవత్సరాలపాటు విచారణ జరిగిన అనంతరం ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్దారించింది నాంపల్లికోర్టు.
ఈకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేశ్ రెడ్డి అనుచరులు అక్బర్ అలీ, మంగయ్య గుప్త, కత్తుల శ్రీనివాస్ లు కేసు తమకు అనుకూలంగా ఉండాలని గవర్నమెంట్ పీపీని బెదిరించటానికి కూడా వెనుకాడలేదు. రాకేష్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తాన్ని జైల్లో ఉండే నడిపించాడు. పీపీ ఇచ్చిన ఫిర్యాదుతో అక్బర్ అలీ, గిప్త, శ్రీనివాస్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న కారులో జయరాం మృతదేహన్ని వదిలేసి రాకేష్ రెడ్డి వదిలివెళ్లాడు . రాకేష్ రెడ్డి కుట్ర చేసి హత్య చేశాడని కోర్టు నిర్ధారించింది. ఈ నెల 9వ తేదీన రాకేష్ రెడ్డికి శిక్షను ఖరారు చేయనుంది కోర్టు. ఈకేసు నుంచి బయటపడటానికి రాకేష్ రెడ్డి చేయాల్సిందంతా చేశాడు. జయరాంను రాకేష్ చిత్ర హింసలు చేసే సమయంలో అక్కడే ఉన్న నిందితులు 11 వీడియోలు, 13 ఫొటోలను తీశారు. వీటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో రాకేష్ రెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. ఇలా రాకేశ్ రెడ్డి అరాచకాలకు ఎట్టకేలకు చెక్ పెడుతు నాంపల్లి కోర్టు తీర్పును ఖరారు చేయనుంది. ఎన్నో మలుపులు తిరిగిన ఈకేసులో ఎట్టకేలకు రాకేశ్ రెడ్డే దోషి అని తేల్చింది నాంపల్లికోర్టు.