మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు చిరంజీవి ఇంట్లో దొంగతనం, మొన్న భాను ప్రియ ఇంట్లో చోరి ఘటనలు ప్రముఖంగా వినబడగా.. ఇప్పుడు విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగినట్లు కేసు నమోదైంది. ఈ మేరకు మోహన్ బాబు మేనేజర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రూ.లక్షల్లో నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో మేనేజర్ పేర్కొన్నారు. పనిమనిషి మీదే అనుమానం ఉన్నట్లుగా మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మోహన్ బాబు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇంట్లో పనిచేసే పనిమనుషులను విచారిస్తున్నారు పోలీసులు. దొంగలు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.