ప్రియాంక రెడ్డి కేసు : నిందితుల ఖైదీ నంబర్లు ఇవే

డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నిందితులను తమను అప్పగించాలని, ప్రియాంకకు న్యాయం చేస్తామని..బహిరంగంగా ఉరి వేయాలని డిమాండ్స్ చేశారు.
తీవ్ర ఉద్రిక్తతుల నడుమ..నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులకు ఖైదీ నెంబర్లు కేటాయించారు జైలు అధికారులు. ఏ 1 మహ్మద్‌కు ఖైదీ నెంబర్. 1979, ఏ 2 జొల్లు శివకు ఖైదీ నెంబర్. 1980, ఏ 3 చెన్నకేశవులుకు ఖైదీ నెంబర్. 1981, ఏ 4 నవీన్ కుమార్‌కు ఖైదీ నెంబర్ 1982 కేటాయించారు.
> 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి నవాబుపేట మండలం కొల్లూరు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఆచూకీ తెలియలేదు.
> నవంబర్ 28వ తేదీ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ దారుణ హత్యకు గురైంది.
> 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు.
> హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు.
> నిందితులంతా ప్రియాంకరెడ్డి స్కూటీని పంక్చర్ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్ చేశారు.
> నిందితులు ఏ 1 మహ్మద్, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్ కుమార్‌లుగా వెల్లడించారు.
> 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
> జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు.
> నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపించాయి.
> చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నారు.
> తొలుత అలాగే భావించినా చివరకు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.
> హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
Read More : ప్రియాంక హత్య కేసు : షాద్ నగర్ టూ చర్లపల్లి.. జైలులో నిందితులు