NSP Irrigation Canal : ఖమ్మం సాగర్ కాలువలో పడి ముగ్గురు గల్లంతు
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కాలువలో స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

Kmm Nsp Canal
NSP Irrigation Canal : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కాలువలో స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మానికి చెందిన పడకబ్ సోని.. అతని కుమారుడు సూరజ్ తోపాటు మరో ఐదుగురు స్నేహితులు ఆదివారం కావటంతో దానవాయగూడెం ఎన్.ఎస్.పి కాలువలో స్నానం చేయటానికి వెళ్లారు.
వీరంతా కేరళ ఆయుర్వేద వైద్యం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇద్దరు కాలువలోకి దిగి ఈత కొడుతుండగా గట్టు పైన సోని, అతని కుమారుడు సూరజ్ మిగిలిన స్నేహితులు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలుడు సూరజ్ ప్రమాదవశాత్తు కాలువలోకి పడ్డాడు.
Also Read : TS Covid Update : తెలంగాణలో నిన్న కొత్తగా 134 కోవిడ్ కేసులు…
ఇది గమనించిన బాలుడు తండ్రి పడకబ్ సోని, అతని స్నేహితులు అభయ్, వివేక్‌లు ఈత రాకపోయిన బాబును కాపాడేందుకు కాలువలోకి దూకారు. మరో ఈత వచ్చిన వ్యక్తి బాలుడు సూరజ్‌ని కాపాడాడు. బాలుడు కోసం కాలువ లోకి దూకిన సోని, అభయ్, వివేక్ గల్లంతయ్యారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.