దారుణం: బతికున్న వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

  • Published By: chvmurthy ,Published On : January 30, 2019 / 12:08 PM IST
దారుణం: బతికున్న వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

Updated On : January 30, 2019 / 12:08 PM IST

శ్రీకాకుళం: జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో సజీవంగా ఉన్నవృద్ధురాలిని కుక్కులు ఈడ్చుకువెళ్లి పీక్కు తిన్నాయి. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ (65)అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి ఇంటి ఆరుబయట అరుగుపై నిద్రించింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో ఆ వీధిలోకి వచ్చిన సుమారు 10 కుక్కల గుంపు ఆవృద్ధురాలిని ఈడ్చుకు వెళ్ళాయి. 

కుక్కలు ఈడ్చుకు వెళ్తున్నప్పుడు బాధతో వృద్ధురాలు కేకలు వేసింది. అర్ధరాత్రి సమయం అవటంతో, జనాలు వచ్చే లోపు ఆమెపై కుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి. మెడపై , ఒంటిపై, కాళ్లపై ,తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మరణించింది. గతంలో కూడా శ్రీహరిపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే మళ్లీ  కుక్కలు దాడి చేశాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.