TV నటి షాకింగ్ కామెంట్స్: నేను ప్రెగ్నెంట్.. నాపై అత్యాచారం చేసింది అతడే!

  • Published By: sreehari ,Published On : November 17, 2019 / 06:57 AM IST
TV నటి షాకింగ్ కామెంట్స్: నేను ప్రెగ్నెంట్.. నాపై అత్యాచారం చేసింది అతడే!

Updated On : November 17, 2019 / 6:57 AM IST

తనను అత్యాచారం చేశారంటూ ఓ టెలివిజన్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక హోటల్ రూంలో తనపై జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది. పైగా తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినట్టుగా తెలిపింది. తనపై అత్యాచారం చేసిన జూనియర్ ఆర్టిస్ట్ హర్యాణాలోని యమునా నగర్ కు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ముంబై ఆధారిత టీవీ నటిగా ఆమె ఎన్నో టీవీ షోల్లో నటించింది. 

కహానీ గహర్ గహర్ కీ, దేశ్ మైన్ నిక్లా హోగా చంద్, నాచ్ బాలియే వంటి షోల్లో నటించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడింది. టీవీ నటి, జూనియర్ ఆర్టిస్టు తొలిసారి ముంబైలో కలిశారు. కొన్ని షోల్లో కలిసి పనిచేశారు కూడా. అప్పటినుంచి ఇరువురి మధ్య స్నేహం పెరిగింది. సన్నిహితంగా  మెలిగారు. ఒక రోజున తాను గర్భవతి అని తెలిసి అతడ్ని పెళ్లి చేసుకోమని అడిగింది. 

కానీ, ఆ జూనియర్ ఆర్టిస్టు ఆమెను పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించాడు. అప్పటినుంచి అతడు ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలంటూ టీవీ నటి యమునా నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమ విషయం గురించి అతడి కుటుంబంలోని అందరికి తెలుసునని, కానీ, అతడికే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించింది.