చిత్ర మరణంపై పలు అనుమానాలున్నాయి : మామ రవిచంద్రన్

చిత్ర మరణంపై పలు అనుమానాలున్నాయి : మామ రవిచంద్రన్

Updated On : December 21, 2020 / 12:20 PM IST

TV Actress VJ Chitra father-in- law complaint to police her death : తమిళ టీవీ నటి వీజే చిత్ర బలవన్మరణంపై పలు అనుమానాలున్నాయని ఆమె మామ, హేమంత్ కుమార్ తండ్రి రవిచంద్రన్ చెన్నై పోలీసు కమీషనర్ కు ఫిర్యాదుచేశారు. లైంగిక వేధింపులు, బెదిరింపుల వల్లే చిత్ర బలవన్మరణానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. కాగా వీజే చిత్ర బలవన్మరణానికి కారణం ఆమె భర్త హేమంత్ కుమార్ కారణమని పోలీసుల విచారణలో తేలటంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

ఈ నేపధ్యంలో అతని తండ్రి, చిత్ర మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసు కమీషనరేట్ లో ఓ ఫిర్యాదు చేశారు.  రాజకీయ నేపధ్యం ఉన్న ఒక తెలుగు యువ హీరోతో   చిత్రకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ నటుడు చిత్రకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను తయారు చేసి, ఆ వీడియోలను ఆమె భర్తకు చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిసింది. 2021 నూతన సంవత్సరం రోజు రాజకీయ పార్టీలో చేరాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడని కూడా తెలిసింది.

కొద్ది రోజులుగా చిత్ర టెన్షన్ తో ఉన్నట్లు తన కుమారుడు చెప్పాడని రవిచంద్రన్ వెల్లడించారు. ఏదో ఒక నంబర్‌ నుంచి ఫోన్ కాల్‌ వచ్చినట్టు, ఆ సమయంలో చిత్ర దూరంగా వెళ్లి ఆగ్రహంతో ఆమె మాట్లాడిన అనంతరం ఆ నెంబర్‌ను డిలీట్‌ చేసినట్లు ఆయన వివరించారు. చిత్ర వివాహం చేసుకోవడం ఎవరికో ఇష్టం లేనట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి చిత్ర తల్లి విజయ నోరు విప్పి నిజాలు చెప్పట్లేదని ఆయన అన్నారు.

ఆమెకు ఫోన్ చేసిన వారి గురించి చిత్ర తల్లికి తెలుసని….. ఆమె వివరాలు బయట పెట్టాలని కోరారు. చిత్ర మరణంపై సమగ్ర విచారణ జరపాలని….తన కుమారుడ్ని విడుదల చేయాలని  ఆయన కమీషనర్ ను కోరారు. కాగా హోటల్ లోని సీసీ కెమెరా విజువల్స్ ఆదృశ్యం కావటం బట్టి చూస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయని రవిచంద్రన్  సందేహం వ్యక్తం చేశారు.