Gang Rape : స్నేహితులని నమ్మి వెళితే.. ఇద్దరమ్మాయిలపై గ్యాంగ్ రేప్

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై..

Gang Rape : స్నేహితులని నమ్మి వెళితే.. ఇద్దరమ్మాయిలపై గ్యాంగ్ రేప్

Gang Rape

Updated On : November 16, 2021 / 11:56 PM IST

Gang Rape : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు నీచులు కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

Extra Marital Affair : ప్రియురాలు-ముగ్గురు ప్రియులు-మధ్యలో భర్త

తాజాగా బీహార్ లో దారుణం జరిగింది. స్నేహితులే కదా అని నమ్మి ఇంటికి వెళ్లిన అమ్మాయిలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నవాడా నగరంలో ఒక యువతి కుటుబంతో కలిసి నివాసముంటోంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె కాలేజీకి సెలవు పెట్టింది. త్వరలో పరీక్షలు మొదలుకానుండడంతో ఆరోజు జరిగిన క్లాస్ నోట్స్ తీసుకోవడానికి పక్క వీధిలో ఉంటున్న తన స్నేహితుడు ఆబీద్ ఇంటికి వెళ్ళింది. తనతో పాటు మరో స్నేహితురాలిని కూడా వెంట బెట్టుకెళ్లింది. అయితే, అక్కడ తన ఫ్రెండ్ ఆబీద్ తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. యువతులు రావడం ఆలస్యం వారు గదికి చిలుకు పెట్టి వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు.

Dead Body : ఘోరం.. యువతిని వివస్త్రను చేసి, జననాంగాన్ని కాల్చేసి..

ఒకరి తరువాత ఒకరు ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు కూడా. అయితే ఓ యువతి మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.