Women Murdered : అత్త, భార్యను నరికి చంపిన వ్యక్తి

సంగారెడ్డి జిల్లా బొల్లారం లోని పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో భార్యను, అత్తను ఒక వ్యక్తి నరికి చంపాడు.

Women Murdered : అత్త, భార్యను నరికి చంపిన వ్యక్తి

Two Women Murdered

Updated On : April 12, 2021 / 12:28 PM IST

Two women murdered in IDA Bollaram : సంగారెడ్డి జిల్లా బొల్లారం లోని పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో భార్యను, అత్తను ఒక వ్యక్తి నరికి చంపాడు.

ఎలక్ట్రీషియన్ గా పనిచేసే నర్సింహ ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్ లో  భార్య స్వరూప తో కలిసి జీవిస్తున్నాడు. కొన్నాళ్ల  క్రితం భార్యా భర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి స్వరూప తన తల్లి వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో నర్సింహ  భార్యను తిరిగి కాపురానికి రావాలని పలుమార్లు కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది.

భార్యపై  కోపం పెంచుకున్న నర్సింహా ఆదివారం ఏప్రిల్ 11 వ తేదీ తెల్లవారు ఝూమున అత్త ఇంటికి వెళ్లాడు. భార్య స్వరూప, అత్త ఎల్లమ్మపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఇద్దరూ మరణించారని నిర్ధారించుకుని డైరెక్ట్ గా వెళ్లి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.

నర్సింహ చేసిన దాడిలో తల్లీ కూతుళ్లిద్దరూ అక్కడి కక్కడే ప్రాణాలు విడిచారు. నర్సింహ లొంగిపోవటంతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను  పోస్టు మార్టం నిమిత్తం  తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.