Uttar Pradesh: కూతురుపై అత్యాచారయత్నం చేసిన భాగస్వామి.. అడ్డుకున్న తల్లి.. కత్తితో ఏం చేసిందంటే

మహిళతో సహజీవనం చేస్తూనే ఆమె మైనర్ కూతురుపై కన్నేశాడో వ్యక్తి. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారయత్నం చేశాడు. అప్పుడే ఇంటికి వచ్చింది ఆమె తల్లి. అతడు చేస్తున్న అరాచకాన్ని చూసి అడ్డుకునే ప్రయత్నం చేసింది.

Uttar Pradesh: కూతురుపై అత్యాచారయత్నం చేసిన భాగస్వామి.. అడ్డుకున్న తల్లి.. కత్తితో ఏం చేసిందంటే

Updated On : August 19, 2022 / 4:31 PM IST

Uttar Pradesh: తనతో సహజీవనం చేస్తన్న వ్యక్తి కూతురుపై అత్యాచార యత్నం చేయడంతో అతడి మర్మాంగాన్ని కోసేసింది ఒక మహిల. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని, లఖీంపూర్ జిల్లా, మహేవా గంజ్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 36 ఏళ్ల ఒక మహిళ, 32 ఏళ్ల వ్యక్తితో రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది.

AK-47 rifles: ఆర్మీ క్యాంపు నుంచి రెండు ఏకే-47 గన్స్ మాయం.. కొనసాగుతున్న విచారణ

ఆమెకు అంతకుముందే ఒక కూతురు ఉంది. ప్రస్తుతం కూతురు వయసు 14. ఇటీవల ఆ బాలిక పొలానికి వెళ్లి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అదే సమయంలో తల్లి ఇంటికి వచ్చింది. అతడు చేస్తున్న దురాగతాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెపై కూడా నిందితుడు దాడి చేశాడు. వెంటనే ఇంట్లోని కత్తి తీసుకొచ్చిన మహిళ అతడి మర్మాంగాన్ని కోసేసింది. తన కూతురును రక్షించుకుంది.

Indian Students: భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెడికల్ విద్యార్థులు తిరిగి రావాలన్న ఉక్రెయిన్

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారయత్నం చేసినందుకుగాను, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడిపై తాను చేసిన దాడి విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని మహిళ చెప్పింది.