UP Woman : భర్తను గొడ్డలితో నరికి…ముక్కలు చేసి నదిలో పడేసిన భార్య

సాక్షాత్తూ భర్తను గొడ్డలితో నరికి చంపి, ముక్కలు చేసి, వాటిని నదిలో పడేసిన భార్య ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ నగరంలో సంచలనం రేపింది....

UP Woman : భర్తను గొడ్డలితో నరికి…ముక్కలు చేసి నదిలో పడేసిన భార్య

UP Woman Kills Husband

Updated On : July 29, 2023 / 1:19 AM IST

UP Woman : సాక్షాత్తూ భర్తను గొడ్డలితో నరికి చంపి, ముక్కలు చేసి, వాటిని నదిలో పడేసిన భార్య ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ నగరంలో సంచలనం రేపింది. (UP Woman Kills Husband) గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ దారుణ హత్య జరిగిందని, నిందితురాలైన మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. భర్త చేతిలో తాను అనుభవించిన గృహహింసను అంతం చేయడానికి అతన్ని చంపినట్లు దులారోదేవి పేర్కొన్నట్లు సర్కిల్ ఆఫీసర్ అన్షు జైన్ తెలిపారు.

Pakistan University : పాక్ యూనివర్శిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు…వెలుగుచూసిన షాకింగ్ వీడియోలు

తన భర్త రాంపాల్ (55) సోమవారం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడని భార్య దులారోదేవి మొదట పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన తండ్రి అదృశ్యంపై అనుమానితుడిగా ఆమె కుమారుడు తల్లి దేవి పేరు చెప్పడంతో, పోలీసులు ఆమెను విచారించగా చివరికి ఆమె నేరాన్ని అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో రాంపాల్ రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Anju-Nasrullah love story : అంజూ-నస్రుల్లా ప్రేమకథలో బిగ్ ట్విస్ట్…అంజూకు పాక్ పౌరసత్వం

మృతదేహం ముక్కలను నదిలో పడేసింది. (Dumps Chopped Body Parts In River) రెండు సిమెంటు బస్తాల నుంచి రాంపాల్ శరీర భాగాలు లభించాయి. కాగా దేవికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నందున అతన్ని హత్య చేసిందని రాంపాల్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.