Fertilizers Stores : విత్తనాల దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనీఖీలు

Fertilizers Stores
Fertilizers Stores : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఎరువులు, పురుగు మందులు అమ్మే దుకాణాలపై ఈరోజు అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, ఎరువులు, అమ్మే దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట, కామారారెడ్డి, సిద్ధిపేట, నల్లగొండ, వికారాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జగిత్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించి 229.55 క్వింటాళ్ల నకిలీ పత్తి, సోయాబీన్ తదితర పంటల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
రికార్డులు లేని 74.3 మెట్రికల్ టన్నుల ఎరువులు, 268 కిలోల క్రిమిసంహరక మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. లెక్కలో చూపని రూ.58లక్షల నగదు స్వాధీనం చేసుకుని 17 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.