Ganja Crop : విశాఖ మన్యంలో గంజాయి తోటలు ధ్వంసం చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని మన్యంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

Ganja Crop : విశాఖ మన్యంలో గంజాయి తోటలు ధ్వంసం చేసిన పోలీసులు

Gang Crop Destroy

Updated On : November 2, 2021 / 8:54 PM IST

Ganja Crop :  ఆంధ్రప్రదేశ్ లోని మన్యంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇటీవలి కాలంలా ఏపీలో గంజాయి విక్రయాలపై అధికార,విపక్షాల సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలి రాజకీయంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

గూడెం కొత్తవీధి సీఐ అశోక్ కుమార్ ఆధ్యర్యంలో గత 3 రోజుల్లో ఏజెన్సీ ఏరియాలో   దాదాపు 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది నాశనం చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని సీఐ తెలిపారు. గంజాయి సాగు, వినియోగంపై గిరిజనులలో అవగాహన కల్పించి గంజాయి పంటను నాశనం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.