వాట్సప్ గ్రూప్ ఎడ్మిన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

Whats app group admin, members booked for hate post, chatting : బహుళ ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సప్ గ్రుప్ ఎడ్మిన్ పై మహబూబాబా బాద్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని కొత్త గూడ మండల కేంద్రంలోని ఓ వాట్సప్ గ్రూప్ లో రెండు కులాల మధ్య జరిగిన సంభాషణ మీద, సంబంధిత గ్రూప్ అడ్మిన్ మీద, చాటింగ్ చేసిన ఇరువురు వ్యక్తులమీద పోలీసులు సంబంధిత ఐటీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
వాట్సప్ గ్రూపులలో అనవసరం విషయాలపైనా, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిమీద చర్యలు తీసుకుంటామని కొత్తగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై తహెర్ బాబా హెచ్చరించారు. గ్రూపు ఎడ్మిన్ లు గ్రూపు లో జరిగే సంభాషణలు, పోస్టింగ్ లపై దృష్టి పెట్టాలని లేని యెడల గ్రూపు లోని సభ్యులు చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.